– యూఎస్‌పీసీ, జాక్టో నేతలపై కేసు నమోదు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ మొదటి పీఆర్సీ నివేదికను విడుదల చేయాలనీ, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను విడుదల చేయాలని కోరుతూ 2020, డిసెంబర్ 29న ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. అప్పటి ప్రభుత్వం కక్షపూరితంగా యూఎస్‌పీసీ, జాక్టో నేతలు చావ రవి, టి లింగారెడ్డి, జి సదానందంగౌడ్‌పై అక్రమ కేసులను బనాయించింది. ఈ కేసుకు సంబంధించి నాలుగేండ్లుగా సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టుకు వారు తిరుగుతున్నారు. ఇటీవల ఆ కేసుకు సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువడనుంది.
నేడే తీర్పు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES