నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియతోపాటు షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. గతనెల 22న ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 2,93,852 మంది, ఒకేషనల్ విభాగంలో 28,339 మంది ఉత్తీర్ణత పొందారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగం రెగ్యులర్‌లో 2,85,435 మంది, ఒకేషనల్ జనరల్ విభాగం రెగ్యులర్‌లో 28,713 మంది విద్యార్థులు పాసయ్యారు.
- Advertisement -