Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంనకిలీ ఐడీ కార్డులతో టోకరా…

నకిలీ ఐడీ కార్డులతో టోకరా…

- Advertisement -

– ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి రూ.72 లక్షలు వసూలు … నిందితుడు అరెస్ట్‌
– మోసపూరిత మాటలు నమ్మొద్దు : ఏఎస్పీ శివం ఉపాధ్యాయ
నవతెలంగాణ-వెంకటాపురం

రాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్‌ ఉద్యోగులతో పరిచయాలు ఉన్నాయటూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తా నని నకిలీ ఐడీ కార్డులు చూపించి నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ఘరానామోసగాడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ములుగు జిల్లా ఏటూర్‌నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఈ కేసుకు సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడిం చారు. సోమవారం ఉదయం వెంకటాపురం స్థానిక బస్టాండ్‌ సమీపంలో ఎస్‌ఐ తిరుపతి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానా స్పదంగా సంచరిస్తున్న అనిల్‌ నాయక్‌ అలియాస్‌ కేతన్‌ను తనిఖీ చేశారు. అతని వద్ద నకిలీ ఐడీ కార్డులను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారిం చారు. ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు ఉన్నాయంటూ నిరుద్యోగులను మోసం చేసి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు విచారణలో వెల్లడైంది. 2019లో వెంకటాపురం మండలంలో లావణ్య అనే మహిళకు ట్రాన్స్‌కో డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆమె స్నేహితులైన రామకృష్ణ, శ్రీలేఖ, మురళీకృష్ణ, ప్రశాంత్‌, నరసింహారావు, మహేశ్వరి, శంకర్‌, చైతన్య, మన్మధరావు, కళ్యాణ్‌ దొర, పద్మ, వెంకటలక్ష్మి, మహేష్‌, లక్ష్మి, లక్ష్మి, పవన్‌, అజ్మల్‌, సుమలత, సునీల్‌, పార్వతి, మురళికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి వారి నుంచి 2020-22లో మొత్తం రూ.72 లక్షలు వసూలు చేసినట్టు బాధితులు శనివారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఏజెన్సీలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేసే వారిని ప్రజలు నమ్మొద్దని ఏఎస్పీ తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగ నియామకాలపై నోటిఫికేషన్లు ఇస్తుందే తప్ప మధ్యవర్తుల ద్వారా ఉద్యోగాలు రావని ప్రజలు గ్రహించాలని అన్నారు. నకిలీ ఐడీ కార్డులతో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా గ్రామాల్లో సంచరిస్తే వివరాలను పోలీసులకు తెలియజేయాలని తెలిపారు. ఈ సమావేశంలో సీఐ ముత్యం రమేష్‌, ఎస్‌ఐ కొప్పుల తిరుపతిరావు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad