Saturday, May 3, 2025
Homeఅంతర్జాతీయంభారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం

భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం

– అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌
న్యూయార్క్‌:
భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ ప్రకటించారు. ప్రముఖ మీడియా సంస్థ ఫాక్స్‌ న్యూస్‌కు గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్‌ ఈ విషయాన్ని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన సుంకాలపై చర్చలు జరుపుతున్న అనేక దేశాల్లో భారత్‌ కూడా ఒకటని, పరస్పర సుంకాలను నివారించడానికి భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అన్నారు. ‘మొదటి ఒప్పందం కుదిరేది భారత్‌తోనే?’ అని ఫాక్స్‌ న్యూస్‌ ప్రతినిధి ప్రశ్నించగా, వాన్స్‌ స్పష్టంగా సమాధానం ఇవ్వలేదు. ‘జపాన్‌, కొరియా, యూరప్‌లోని కొన్ని దేశాలతోనూ చర్చలు జరుపుతున్నాం. భారత్‌తో కూడా ఫలవంతమైన చర్చలు జరుగుతున్నాయి’ అని వాన్స్‌ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 2న భారత్‌, చైనాతో సహా అనేక దేశాలపై విస్తృత పరస్పర సుంకాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఏప్రిల్‌ 9న, చైనా, హాంకాంగ్‌పై తప్ప మిగిలిన దేశాలపై జూలై 9 వరకు అంటే 90 రోజుల పాటు ఈ సుంకాలను నిలిపివేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఈ దశలో దాదాపు 75 దేశాలు వాణిజ్య ఒప్పందాల కోసం అమెరికాను సంప్రదించాయి. ఫిబ్రవరిలో అమెరికా పర్యటనలోనే ట్రంప్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపారు. అమెరికా సుంకాలు విధించిన తరువాత ఈ వాణిజ్య ఒప్పందం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వాణిజ్య ఒప్పందం సుంకాలు, మార్కెట్‌ యాక్సెస్‌తో సహా అనేక రకాల సమస్యలను పరిష్కరిస్తుందని అమెరికా చెబుతోంది. ఈ వాణిజ్య ఒప్పందం అమెరికాకే లాభసాటిగా ఉంటుందని, ముఖ్యంగా అమెరికా వ్యవసాయోత్పత్తులను ఇక్కడ విరివిరిగా ప్రవేశపెడతారు. దీంతో భారత్‌ రైతులకు పోటీ అధికమవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img