నవతెలంగాణ- హైదరాబాద్: త్వరలో భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయనున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బసెంట్ ప్రకటించారు. ట్రంప్ విధించిన టారిఫ్‌లను నిలువరించేలా.. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసిన మొదటి దేశాల్లో భారత్ ఒకటిగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం బసెంట్ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఇతర దేశాలతో అమెరికా వాణిజ్య సంబంధాలపై తాజా పరిణామాలను వివరించారు. ఆసియా వాణిజ్య భాగస్వామ్యులతో చర్చలు ఫలవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు. గతవారం అమెరికా ఉపాధ్యక్షుడు జెడివాన్స్ భారత్‌లో పర్యటించారని, చర్చల్లో పురోగతి సాధించినట్లు చెప్పారని అన్నారు. దక్షిణ కొరియా, మిత్రదేశమైన జపాన్‌తోనూ చర్చల్లో పురోగతి ఉందని తాను భావిస్తున్నానని అన్నారు. చర్చలకు లోబడి 15 నుండి 18 రోజుల్లో ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాల్లో భారత్ ప్రత్యేకంగా నిలవనుందని అన్నారు. చాలా దేశాలు మంచి ప్రతిపాదనలతో వచ్చాయని, వాటిని నిశితంగా పరిశీలిస్తున్నామని అన్నారు. తాము సంతకం చేసే వాణిజ్య ఒప్పందాల్లో మొదటి దేశంగా భారత్ నిలవనుందని అన్నారు.
త్వరలో భారత్‌తో వాణిజ్య ఒప్పందం: యూఎస్ ట్రెజరీ సెక్రటరీ
- Advertisement -
RELATED ARTICLES