- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చి, వెళ్తున్న భక్తులతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. వాహనాల రద్దీతో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. పసరా నుంచి తాడ్వాయి మీదుగా మేడారం చేరుకునే ఆర్టీసీ బస్సులతో పాటు, వీఐపీ వాహనాలు శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ జామ్ కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పసరా నుంచి నార్లాపూర్ రూట్‌లో వెళ్లే ప్రయివేటు వాహనాలు కూడా నెమ్మదిగా కదులుతున్నాయి.
మేడారం నుంచి పసరాకు చేరేందుకు 10 గంటల సమయం పడుతోంది. పసరా నుంచి తాడ్వాయి చేరుకునేందుకు మరో నాలుగు గంటల సమయం పడుతోంది.
- Advertisement -



