నవతెలంగాణ- జోగులాంబ గద్వాల
రోడ్డు పై దొరికిన డబ్బును పోగొట్టుకున్న వ్యక్తికి ట్రాఫిక్ ఎస్సై బాచంద్రుడు అందజేశారు. రోడ్డుపై దొరికిన డబ్బును పోలీసులకు అప్పజెప్పి మహిళలు నిజాయితీ చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే గద్వాల పట్టణంలోని దయానంద స్కూల్లో పీటీ గా విధులు నిర్వహిస్తున్న గంజిపేటకు చెందిన తిమన్న గురువారం ఉదయం పట్టణం లోని ప్రభుత్వ బాలికల పాఠశాల ముందు నడుచుకుంటూ వెళ్తుండగా రోడ్డుపై రూ.10వేలు పడిపోయాయి. అదే సమయంలో ఆ దారిలో వెళ్తున్న దౌదర్ పల్లిలో నివాసం ఉంటున్న కంట్లో నలుసు తీసే ముగ్గురు మహిళలకు ఆ డబ్బులు కనిపించాయి. వారు ఆ నగదును తమ వద్ద ఉంచుకోకుండా, నిజాయితీకి నిదర్శనంగా గద్వాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ కు అప్పగించారు. డబ్బులు పోగొట్టుకున్న సమాచారాన్ని గురువారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా విషయాన్ని తన వరకు వెళ్లిన తర్వాత ఎస్సై ను కార్యాలయంలో ప్రత్యేకంగా కలిసి విషయాన్ని తెలియజేశారు. శుక్రవారం డబ్బు పోగొట్టుకున్న వ్యక్తి తిమ్మన్న ట్రాఫిక్ కార్యాలయం కు వచ్చాడు. అతడితో ట్రాఫిక్ ఎస్సై మాట్లాడి ఆట్టి డబ్బు అతనివే అని ట్రాఫిక్ ఎస్సై నిర్ధారించుకొని అతడికి అందజేశారు. తిమ్మన్న ట్రాఫిక్ ఎస్సై, మహిళలలకు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో హోంగార్డు యుగేందర్ పాల్గొన్నారు.
దొరికిన డబ్బును పోగొట్టుకున్న వ్యక్తికి అందజేసిన ట్రాఫిక్ ఎస్సై
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



