నవతెలంగాణ-హైదరాబాద్ : ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయిన సందర్భంగా బీజేపీ చేపట్టిన ‘తిరంగ యాత్ర’ రేపు హైదరాబాద్ లో జరగనున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో రేపు సాయంత్రం 5 గంటలకు ట్యాంక్‌బండ్ వద్ద ఈ యాత్ర సాగనుండటంతో.. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రేపు సా.5:30 నుంచి 7:30 వరుకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ ప్రకటించారు. ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహం, సచివాలయం, సెయిలింగ్ క్లబ్.. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి వాహనాలు అనుమతించబడవని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి సూచించారు. కాగా ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
ఈ ఆపరేషన్ సక్సెస్ ను పురస్కరించుకొని బీజేపీ దేశవ్యాప్త తిరంగ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఈ యాత్ర హైదరాబాద్‌లో జరగనుండగా.. దీనికి కేంద్ర మంత్రి, తెలంగాణ BJP అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి , జమ్మూ కాశ్మీర్ DGP తోపాటు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి రిటైర్డ్ IPS, DGP ర్యాంక్ అధికారులు, సైనిక అధికారులు, రక్షణ సిబ్బంది, కళాకారులు, బీజేపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, సామాన్య ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది.
రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES