నవతెలంగాణ-హైదరాబాద్: వియత్నాం తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న ఓ పడవ బోల్తాపడి 34 మంది మరణించారు. మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. సహాయక బృందాలు 11 మందిని రక్షించాయి. పర్యాటకుల్లో దాదాపు 20 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే, వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హా లాంగ్ బేకు 48 మంది పర్యాటకులు, ఐదుగురు సిబ్బందితో ఓ పడవ బయలుదేరింది. అయితే, ఆ సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన గాలులు వీయడంతో పడవ అదుపుతప్పి బోల్తా పడింది. విషయం తెలిసిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి పలువురిని రక్షించాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక మీడియా తెలిపింది.