- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: టాలీవుడ్ హీరో ‘అల్లరి’ నరేష్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తాతయ్య, దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తండ్రి ఈదర వెంకట్రావు (90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో పాటు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్రావు మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య వెంకటరత్నం 2019లో మరణించారు. వెంకట్రావుకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. ఆయన 2011లో మృతి చెందారు. ప్రముఖ నటులు అల్లరి నరేష్, ఆర్యన్ రాజేశ్ ఆయన కుమారులే. వెంకట్రావు అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4 గంటలకు నిడదవోలు మండలం కోరుమామిడిలో జరగనున్నాయి.
- Advertisement -



