- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి జి. రామరాజు (85) ఈ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్ మధురానగర్‌లోని తన స్వగృహంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణంతో శివాజీ రాజా, ఆయన కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. రామరాజు భౌతికకాయాన్ని అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం ప్రస్తుతం వారి నివాసంలోనే ఉంచారు. కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
- Advertisement -



