Thursday, December 11, 2025
E-PAPER
Homeక్రైమ్విషాదం..తల్లిదండ్రుల మధ్య నలిగి శిశువు దుర్మరణం

విషాదం..తల్లిదండ్రుల మధ్య నలిగి శిశువు దుర్మరణం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమరోహా జిల్లా సిహాలి జాగీర్‌ గ్రామంలో నిద్రపోతున్న తల్లిదండ్రుల మధ్య నలిగి 26 రోజుల నవజాత శిశువు మృతిచెందిన ఘటన వెలుగు చూసింది. మొక్కల నర్సరీ నడుపుతున్న సద్దామ్‌కు ఏడాది క్రితం ఆస్మాతో వివాహం జరిగింది. గత నెల ఆస్మా మగబిడ్డకు జన్మనిచ్చింది. శ్వాస సమస్య తలెత్తడంతో వైద్యులు ఆ చిన్నారిని కొన్నిరోజులు పర్యవేక్షణలో ఉంచారు. పరిస్థితి మెరుగయ్యాక దంపతులు ఆ బిడ్డను ఇంటికి తీసుకొచ్చారు. కొద్దిరోజులకు కామెర్లు రావడంతో మరోసారి చికిత్స చేయించారు. బిడ్డకు నామకరణం చేశారు. గత శనివారం రాత్రి తల్లిదండ్రుల మధ్య బాబును పడుకోబెట్టుకోగా.. ఇరుక్కుపోయిన చిన్నారి ఊపిరాడక మృతిచెందాడు. ఆదివారం ఉదయం బిడ్డకు పాలు తాగించాలని చూసిన ఆస్మా కదలిక లేకపోవడం చూసి ఖిన్నురాలైంది. వెంటనే గజ్రౌలా కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -