Monday, February 16, 2026
E-PAPER
Homeఆదిలాబాద్విషాదం.. కాలువలో పడి బాలుడి మృతి

విషాదం.. కాలువలో పడి బాలుడి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బోథ్ మండలంలోని కరత్వాడ ప్రాజెక్టు వద్ద మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ సమీపంలోని కాలువలో షేక్ ఇమ్రాన్ (12) అనే బాలుడు ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్నప్పుడు బంతి కాలువలో పడడంతో, దానిని తీసుకోవడానికి వెళ్ళిన బాలుడు కాలువలో పడి మరణించినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -