Sunday, October 5, 2025
E-PAPER
Homeఆదిలాబాద్బతుకమ్మ వేడుకల్లో విషాదం..నవ వధువు మృతి

బతుకమ్మ వేడుకల్లో విషాదం..నవ వధువు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్పాడు గ్రామంలో బతుకమ్మ వేడుకల్లో విషాదం నెలకొంది. వానల్పాడు గ్రామంలో శనివారం రాత్రి జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఇటీవల గ్రామానికి చెందిన రాజుతో పెండ్లి అయి రుషిత అత్తారింటి తొలి బతుకమ్మ వేడుకల్లో భాగంగా తోటి మహిళతో ఆటపాటలతో బతుకమ్మ ఆడింది. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలతో ఉన్న రిషిత, తలనొప్పితో ఇంటి బాట పట్టింది. గమనించిన కుటుంబీకులు స్థానికంగా చికిత్స అందించి, బైంసా పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. చికిత్సలు అందించేలోపే నవవధువు మృత్యువాత పడింది. నవ వధువు మృతి బాధిత కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -