నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ లోని బాలానగర్‌లో విషాదాకర ఘటన చోటుచేసుకుంది. కన్న తల్లి తన ఇద్దరు కవల పిల్లలను హత్య చేసి.. ఆపై తల్లి సాయి లక్ష్మీ కూడా భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం గా మారింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి పద్మనగర్ ఫేజ్ 1 లో సాయి లక్ష్మి, అనిల్ కుమార్ లు నివాసం ఉంటున్నారు. సాయి లక్ష్మి (27) ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో తన కవల పిల్లలు అయిన చేతన్ కార్తికేయ(2), లాస్య వల్లి(2)లను గొంతు నులిమి చనిపోయింది. అనంతరం సాయి లక్ష్మి తన నివాసం ఉంటున్న ఇంటి మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త అనిల్‌తో గొడవ కారణంగా సాయి లక్ష్మి తన పిల్లలను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం.

                                    

