Thursday, November 13, 2025
E-PAPER
Homeక్రైమ్దుండిగల్‌ లో విషాదం…గేటు మీద పడి బాలుడు మృతి

దుండిగల్‌ లో విషాదం…గేటు మీద పడి బాలుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్‌: దుండిగల్‌ పరిధిలోని బౌరంపేటలో విషాదం చోటుచేసుకున్నది. అమ్మమ్మ తాత వద్దకు వచ్చిన బాలుడు నిర్మాణంలో ఉన్న భవనం ముందున్న గేటు మీదపటడంతో మృతిచెందాడు. మెదక్‌ జిల్లా కుకునూరు మండలం వెల్దుర్తికి చెందిన ఆకాశ్‌ అనే ఏడేండ్ల బాలుడు.. బౌరంపేటలో నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న అమ్మమ్మ, తాతల వద్దకు బుధవారం వచ్చాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం గేటు వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు అది బాలుడిపై పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆకాశ్‌ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -