Thursday, May 15, 2025
Homeతాజా వార్తలుసంగారెడ్డిలో విషాదం.. పిడుగుపాటుతో ఇద్దరు మృతి

సంగారెడ్డిలో విషాదం.. పిడుగుపాటుతో ఇద్దరు మృతి

- Advertisement -

నవతెలంగాణ సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పిడుగుపాటుకు గురై వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మృతి చెందారు. న్యాల్కల్ మండలం డప్పుర్ లో సాబేర్ (15) అనే వ్యక్తి ఓ చెట్టు కింద ఉండగా పిడుగు పడి చనిపోయాడు. ఈ ఘటనలో మరో ఐదుగురికి ప్రాణాపాయం తప్పిందని గ్రామస్థులు తెలిపారు. కోహిర్ మండలం నాగిరెడ్డిపల్లిలో ఎడ్ల రత్నమ్మ (61) పిడుగుటుతో మృతి చెందారు. ఈ ఘటనలతో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -