- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: వాయువ్య శ్రీలంకలో విషాదం నెలకొంది. అటవీ ప్రాంతంలోని మఠం వద్ద కేబుల్‌తో పనిచేసే రైలు బండి బోల్తా పడి ఒక భారతీయుడితో సహా ఏడుగురు బౌద్ధ సన్యాసులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఆరుగురికి గాయాలయ్యాయని పోలీసులు గురువారం తెలిపారు. ఈ ఘటన బుధవారం రాత్రి కొలంబో నుండి 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న నికావెరాటియాలో ఉన్న ప్రఖ్యాత బౌద్దారామం అయిన నా ఉయన అరణ్య సేనసనయలో జరిగింది. ఈ మఠం ధాన్య విహారయాత్రలకు ప్రసిద్ధి చెందింది. మరణించిన ఏడుగురు సన్యాసుల్లో ఒక భారతీయుడు, రష్యన్, రొమేనియన్ జాతీయులు ఉన్నారని పోలీసులు తెలిపారు. గాయపడిన ఆరుగురిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
- Advertisement -