- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : జంషెడ్పూర్ సమీపంలోని మలియంత గ్రామంలో మార్చి 13, 14 తేదీల రాత్రి జరిగిన ఒక వివాహ వేడుకలో 41 ఏళ్ల లలిత్ సింగ్ అనే వ్యక్తి రసగుల్లా గొంతులో ఇరుక్కుని మరణించాడు. తీపి పదార్థం శ్వాసనాళాలను అడ్డుకోవడంతో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందని వైద్యులు తెలిపారు. వేగంగా మింగడం వల్ల ఎపిగ్లాటిస్ గొంతు వెనుక భాగంలో ఇరుక్కుపోయి ఈ దుర్ఘటన జరిగినట్లు వైద్యులు వివరించారు. ఈ ఘటన దేశంలోనే తొలిసారిగా వెలుగులోకి వచ్చింది.
- Advertisement -



