- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మద్యం మత్తులో ఓ వ్యక్తి 220కేవీ విద్యుత్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. ఈ ఘటన తిరుపతిలోని గురవరాజుపల్లిలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి నిన్న అర్ధరాత్రి నుంచి టవర్ ఎక్కి కూర్చున్నాడు. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పవర్ కట్ చేశారు. మంగళవారం ఉదయం వరకు అతను వైరుకు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు, స్థానికులు వల పట్టుకోగా అతను పైనుంచి దూకేశాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
- Advertisement -