- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కడప, మదనపల్లె, కుప్పం, నందలూరు తదితర ప్రాంతాలకు చెందిన సురేశ్, సాయి మనోజ్, భగవాన్, ఫిరోజ్, హష్రఫ్, కృష్ణ చైతన్య, హరిబాబు, హర్షవర్ధన్లు సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యారు. ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నారు. ఆదివారం కడప పరిసర ప్రాంతాల్లో సన్నివేశాలు చిత్రీకరించారు. సాయంత్రం పెన్నా నదిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. వారిలో కృష్ణ చైతన్య (20), హర్షవర్ధన్ (22), హరిబాబు (25) నదిలో దిగారు. ముగ్గురికీ ఈత రాకపోవడంతో సుడిగుండంలో చిక్కుకున్నారు. హరిబాబు, హర్షవర్ధన్ మృతదేహాలను వెలికి తీయగా.. కృష్ణ చైతన్య కోసం గాలిస్తున్నారు.
- Advertisement -



