Thursday, March 12, 2026
E-PAPER
Homeక్రైమ్విషాదం: పరీక్షకు వెళ్తూ ఇద్దరు విద్యార్థుల మృతి

విషాదం: పరీక్షకు వెళ్తూ ఇద్దరు విద్యార్థుల మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : శంషాబాద్ ‎లోని పెద్ద షాపూర్ దగ్గర గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. కొత్తూరు మండల కేంద్రానికి చెందిన బిక్కి సింగ్, సురజ్‎లు పరీక్ష రాయడానికి బైక్‎పై వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. మంత్రి వాకిటి శ్రీహరి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -