Sunday, October 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుయూరియా బస్తాల కోసం వెళ్ళుతూ విషాదం..

యూరియా బస్తాల కోసం వెళ్ళుతూ విషాదం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-మహబూబాబాద్ : జిల్లాలోని గూడూరు మండలం గూడూరు నుండి మహబూబాబాద్ వెళ్లే జాతీయ రహదారి 365 రోడ్డుపై జగన్ నాయకులగూడెం స్టేజి వద్ద టూ విల‌ర్ బొలెరో ఢీ కొట్టిన సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరి పరిస్థితి విష‌మంగా ఉంది. దుబ్బగూడెంకు చెందిన దారావత్ వీరన్న బానోత్ లాల్యలు యూరియా బస్తాల కొరకు బొద్దుగొండ వెళుతుండగా ద్విచక్ర వాహనం బోలేరా వాహనం ఢీకోంది. బానోత్ వాల్య అక్కడికక్కడే మృతి చెందగా వీరన్న పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం ఆస్ప‌త్రికి తరలించారు సంఘటన స్థలాన్ని సిఐ సూర్యప్రకాష్ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -