Monday, January 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంస్పెయిన్‌లో రైలు ప్ర‌మాదం..పెరిగిన మృతుల సంఖ్య‌

స్పెయిన్‌లో రైలు ప్ర‌మాదం..పెరిగిన మృతుల సంఖ్య‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: స్పెయిన్‌లో రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొన్న(Train Crash) ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య 39కి చేరింది. ఇంకా రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది. ద‌క్షిణ స్పెయిన్‌లోని అడ‌ముజ్ వ‌ద్ద ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. మాడ్రిడ్‌కు వెళ్తున్న ఓ రైలు ప‌ట్టాలు త‌ప్పి, మరో మార్గానికి చెందిన ప‌ట్టాల‌పై ప‌డిపోయింది. దీంతో ఆ ట్రాక్‌పై వ‌స్తున్న ఓ రైలును ఢీకొట్టింది. ఆదివారం రాత్రి ఏడున్న‌ర స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. రైలు ప్ర‌మాదంలో మృతిచెందిన‌, గాయ‌ప‌డిన వారిలో ఎక్కువ ముందు బోగీల్లో వారున్ఏనారు.

మాడ్రిడ్ నుంచి హుల్వేకు వెళ్తున్న రైలులో తీవ్ర న‌ష్టం జ‌రిగింది. ప్ర‌మాదం చాలా తీవ్రంగా ఉన్న‌ట్లు ర‌వాణాశాఖ మంత్రి ఆస్కార్ పెంట్ వెల్ల‌డించారు. అడ‌ముజ్ ప‌ట్ట‌ణంలో స్పానిష్ రెడ్ క్రాస్ ఓ హెల్ప్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేసింది. భ‌ద్ర‌తా సిబ్బంది రాత్రంతా ప్ర‌మాద ప్రాంతంలో రెస్క్యూ చ‌ర్య‌లు చేప‌ట్టాయి.రెండు రైళ్ల‌లో క‌లిపి మొత్తం 400 మంది ప్ర‌యాణికులు, సిబ్బంది ఉన్న‌ట్లు గుర్తించారు. ఎమ‌ర్జెన్సీ సిబ్బంది సుమారు 122 మందికి చికిత్స అందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -