Saturday, July 12, 2025
E-PAPER
Homeఖమ్మంపామాయిల్ కేంద్రీయ నర్సరీని సందర్శించిన శిక్షణా కలెక్టర్ సౌరభ్ శర్మ

పామాయిల్ కేంద్రీయ నర్సరీని సందర్శించిన శిక్షణా కలెక్టర్ సౌరభ్ శర్మ

- Advertisement -

నిర్వహణను వివరించిన ఆయిల్ ఫెడ్ జిల్లా ఇంచార్జి రాధాక్రిష్ణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
: జిల్లాకు కేటాయించిన శిక్షణా కలెక్టర్ సౌరభ్ శర్మ శుక్రవారం మండలంలోని ఆయిల్ ఫెడ్ కేంద్రీయ పామాయిల్ నర్సరీ ని సందర్శించారు. పామాయిల్ విత్తన సేకరణ నుండి నూనే దిగుమతి అయ్యా వరకు అన్ని దశలను ఆయన అవగాహన చేసుకుంటున్నారు. విత్తన సేకరణ ఎక్కడ నుండి?మొక్కగా ఎన్ని రోజులు పెంచుతారు?రైతుకు ఎంత వయస్సు మొక్కను అందజేస్తారు?నర్సరీ నిర్వహణ,వ్యయం,యాజమాన్య విధానాలను ఆయిల్ ఫెడ్ జిల్లా ఇంచార్జి నాయుడు రాధాక్రిష్ణ ను అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుండి దమ్మపేట మండలం అప్పారావు పేట పామాయిల్ పరిశ్రమను సందర్శించారు.అక్కడ సహాయ మేనేజర్ బాణాల వెంకటేష్ గెలలు నుండి నూనే తీసే పలు దశలను శిక్షణా కలెక్టర్ సౌరభ్ శర్మకు వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -