Tuesday, May 20, 2025
HomeUncategorized26 నుంచి లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు శిక్షణ

26 నుంచి లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు శిక్షణ

- Advertisement -

– విలేజ్‌ మ్యాప్‌ల డిజిటలైజేషన్‌కు శ్రీకారం : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఈ నెల 26 నుంచి లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు రెండు నెలల పాటు ట్రైనింగ్‌ అకాడమిలో శిక్షణ ఇవ్వనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల నియామకంపై సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఐదు వేల మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల నియామకానికి , 10,031 దరఖాస్తులు వచ్చాయని ఈ సందర్భంగా మంత్రికి అధికారులు వివరించారు. విద్యార్హతలు, నైపుణ్యం, అనుభవం అధారంగా ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ (టీజీఆర్‌ఏసీ) ద్వారా సర్వే రికార్డులను (మ్యాపులు) డిజిటలైజేషన్‌ చేపడుతున్నామని తెలిపారు. డిజిటల్‌ మ్యాప్‌లను ఎక్కడినుంచైనా సులభంగా యాక్సెస్‌ అవుతాయనీ, మాన్యువల్‌ పద్ధతుల కంటే వేగంగా, తక్కువ ఖర్చుతో ఖచ్చితమైన సమాచారం పొందవచ్చని అన్నారు. భూక్షేత్రాల పరిమాణం, ఆకృతి వంటి వివరాలు ఇందులో ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెరగడంతో పాటు మ్యుటేషన్‌ ప్రక్రియ వేగవంతమవుతుందని అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -