Friday, March 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా సంఘాల బలోపేతానికే శిక్షణ

మహిళా సంఘాల బలోపేతానికే శిక్షణ

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్
సదాశివ నగర్ మండలంలోని స్వయం సహాయక సంఘాల బలోపేతానికి శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం  స్థానిక రైతు వేదికలో మండల సమైక్య అధ్యక్షురాలు బాలం బాయ్ అధ్యక్షతన ఏర్పాటు చేయడమైనది. ఈ శిక్షణ కార్యక్రమానికి సీనియర్ కమ్యూనిటీ బేసిక్ రిసోర్స్ పర్సన్ సీఆర్పీ శారద సప్న   పాల్గొని శిక్షణ ఇవ్వడం జరిగింది. స్వయం సహాయక సంఘాల్లో  ప్రతి నెల పొదుపులు అప్పులు బ్యాంకు రుణాలు శ్రీనిధి అప్పులు తీసుకొని ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా నిర్వహించుకోవాలని అంశాలపై సుదీర్ఘంగా చెప్పారు.

గ్రామస్థాయిలో  స్వయం సహాయక సంఘాల్లో కట్టుబాట్లపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని గ్రామ సంఘాల్లో  పాలకవర్గ సభ్యుల విధులు బాధ్యతలపై వివరించారు. కోటి మంది మహిళలను కోటేశ్వర్లు చేయాలని ఉద్దేశంతో గ్రామాల్లోని మహిళలందరినీ సంఘాలలో చేర్పించాలని వివరించడం జరిగింది. అనంతరం ఏపిఎం ప్రసాద్  మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాపకముగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఈనెల 6 నుండి  జూన్ 2వ తారీకు వరకు విద్యా వైద్య వ్యవసాయ క్రీడలు యువతకు నైపుణ్యత కార్యక్రమాలు నిర్వహించబడతాయని అన్నారు.

గ్రామస్థాయిలో స్వయం సహాయక సంఘాల సభ్యులందరూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సభ్యులందరూ ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి పథంలో ముందుండాలని మహిళలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు బలం భాయ్ సీసీలు అంజా గౌడ్, అంజయ్య, రాజు, ప్రతాప్, భూమయ్య, అకౌంటెంట్ రమేష్ పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -