Monday, April 6, 2026
E-PAPER
Homeజిల్లాలుఆహార పదార్థాల సంరక్షణపై శిక్షణ…

ఆహార పదార్థాల సంరక్షణపై శిక్షణ…

- Advertisement -
  • సర్టిఫికెట్లు అందజేసిన కలెక్టర్..
    నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్: 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈరోజు హెల్త్ వీక్ – డే 1: ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డే కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో స్వాతి , ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో బీసీ, ఎస్‌టి సంక్షేమ హాస్టళ్ల వంట సిబ్బంది, వార్డెన్లు, అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హాస్టళ్లలో పిల్లలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించాలని, పరిశుభ్రత పాటిస్తూ ఫుడ్ పొయిజనింగ్ నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.శారీరక ఆరోగ్యం కోసం సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరమని, ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండి, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు వంటి సహజ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని అన్నారు. భువనగిరి గంజ్ ప్రాంతంలో ఈట్ రైట్ రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఎయిమ్స్ బీబీనగర్, స్వర్ణగిరి దేవస్థానం ఫుడ్ హ్యాండ్లర్లకు ఎఫ్ఓఎస్టిఏసి శిక్షణ సర్టిఫికెట్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, జడ్పీ సిఈఒ శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా వైద్యాధికారి మనోహర్, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, డిసిఓ మాధవి కూడా పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -