Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంమహారాష్ట్రలో కూలిన శిక్ష‌ణ విమానం

మహారాష్ట్రలో కూలిన శిక్ష‌ణ విమానం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని బారామణి విమానాశ్రయం సమీపంలో ఒక శిక్షణా విమానం కూలిపోయింది. రెడ్‌బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ సెంటర్ యాజమాన్యంలోని విమానం శిక్షణా పూర్తి చేసుకున్న తర్వాత ల్యాండ్‌కు సిద్ధపడుతుండగా టైర్లలో ఒకటి దెబ్బతిన్నట్లుగా గుర్తించాడు. దీంతో పైలట్ అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు. ఆ సమయంలో ముందు చక్రం ఊడిపోయింది. విమానం రన్‌వే నుంచి పక్కకు వెళ్లిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. పైలట్ సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img