నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో బుధవారం ఓ విమానం కూప్పకూలింది. కేపీ కాలేజీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గాలిలో ఎగురుతున్న ఆర్మీ శిక్షణ విమానం అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి పెద్ద శబ్దంతో కాలేజీ వెనుక ఉన్న చెరువులో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఉన్న ఇద్దరు పైలట్లతో పాటు మరో వ్యక్తి పారాచూట్ల సహాయంతో కిందకు దూకి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రయాగ్‌రాజ్ నగర మధ్యలో ఉన్న ఈ భారీ శబ్దాన్ని విన్న స్థానికులు, కాలేజీ విద్యార్థులు భయంతో ఘటనా స్థలానికి పరుగులు తీశారు. సంఘటనా స్థలంలో ఆర్మీకి చెందిన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై సైన్యం దర్యాప్తుకు ఆదేశించింది. జనసాంద్రత తక్కువగా ఉన్న చెరువులో విమానం పడటంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు భావిస్తున్నారు.
చెరువులో కూలిన శిక్షణ విమానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



