Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా కృష్ణ మాలకొండ రెడ్డి

జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా కృష్ణ మాలకొండ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ-కంఠేశ్వర్ : నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ ಜಿಲ್ಲಾ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ గా డాక్టర్ కృష్ణ మాలకొండ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్ చౌన్దతు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాల్, జిల్లా జనరల్ ఆస్పత్రులకు నూతన సూపరింటెండెంట్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాదులోని ఉస్మానియా మెడికల్ కళాశాల కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణ మాలకొండ రెడ్డిని నిజామాబాద్ జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా నియమించారు. దాదాపు దశాబ్ద కాలంగా నిజామాబాద్ జనరల్ ఆస్పత్రికి రెగ్యులర్ సూపరింటెండెంట్ నియామకం జరగక ఇన్ చార్జిలతో నెట్టుకొస్తున్నారు.

అలాగే నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా మహేశ్వరం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ కృష్ణమోహన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మెడికల్ కళాశాలకు ప్రొఫెసర్ ఇందిరా బదిలీ తర్వాత ఇన్ చార్జి ప్రిన్సిపాల్‌గా డాక్టర్ శివప్రసాద్ పనిచేస్తున్నారు. ప్రభుత్వం నూతనంగా చేపట్టిన నియామకాల ప్రకారం కొత్త వైద్య అధికారులు నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తారా లేక ఇన్ చార్జిల పాలన త్వరలో తేలిపోనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -