Wednesday, March 18, 2026
E-PAPER
Homeజాతీయంపశ్చిమబెంగాల్‌లో బ‌దిలీల‌ ప‌రంప‌ర‌

పశ్చిమబెంగాల్‌లో బ‌దిలీల‌ ప‌రంప‌ర‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో అధికారుల బ‌దిలీల‌ ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఇటీవ‌లె ఆ రాష్ట్ర సీఎస్, డీజీపీల‌ను బ‌దిలీ చేసింది. తాజాగా మ‌రో 13 మంది ఐఎఎస్‌లను ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం బదిలీ చేసింది. పలువురు జిల్లా మెజిస్ట్రేట్‌లు (డీఎం)లను నియమించడంతో పాటు, వారిని జిల్లా ఎన్నికల అధికారులుగా (డీఈఒ)కూడా నియమించి, ఎన్నికల పరిశీలకులుగా కీలక బాధ్యతలను అప్పగించాలని ఆదేశించింది. జితిన్‌యాదవ్‌ (కూచ్‌ బెహార్‌), సందీప్‌ ఘోష్‌ (జల్పాయి గరి), వివేక్‌ కుమార్‌ (ఉత్తర దినాజ్‌పూర్‌), రాజన్వీర్‌ సింగ్‌ కపూర్‌ (మాల్డా), ఆర్‌.అర్జున్‌ (ముర్షిదాబాద్‌) సహా పలువురు అధికారులను జిల్లా మెజిస్ట్రేట్‌ కమ్‌ డిస్ట్రిక్‌ పోల్‌ ఆఫీసర్స్‌గా నియమించినట్లు ఇసి తెలిపింది. స్మితా పాండే కోల్‌కతా మునిసిపల్‌ కార్పోరేషన్‌ కమిషనర్‌గా, కోల్‌కతా నార్త్‌ డిఇఒగా నియమితులవగా, రణధీర్‌ కుమార్‌ కోల్‌కతా సౌత్‌ డిఇఒగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకు బదిలీ అయిన అధికారులను ఎన్నికలకు సంబంధించిన ఏ విధుల్లోనూ నియమించకూడదని ఈసీ ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -