Tuesday, March 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమియాపూర్ లో భారీ శబ్దంతో పేలిన ట్రాన్స్‌ఫార్మర్..

మియాపూర్ లో భారీ శబ్దంతో పేలిన ట్రాన్స్‌ఫార్మర్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్‌లోని మియాపూర్ పరిధిలో హఫీజ్‌పేట–మార్తాండనగర్ కాలనీలో ట్రాన్స్‌ఫార్మర్ పేలిన ఘటన కలకలం రేపింది. అధిక లోడ్ కారణంగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు ప్రభావంతో సమీపంలో ఉన్న టాటా ఏస్ వాహనం, రెండు బైకులు, విద్యుత్ తీగలకు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -