– ప్రజాసమస్యల పట్ల నిబద్ధత కలిగిన నాయకులను సూచించండి : ఏఐసీసీ అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
డీసీసీ అధ్యక్షుల ఎంపిక విధానం పారదర్శకంగా జరిగేలా, ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ కమిటీలను బలోపేతం చేయడం కోసం పారదర్శకత, నిబద్ధత, సామర్థ్యం ఉండేలా ‘పున:సంఘటన అభియాన్’ కార్యక్రమం చేపడుతున్నామని ప్రజా సమస్యల పట్ల నిబద్ధత కలిగిన నాయకులను సూచించండని ఏఐసీసీ అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్ కార్యకర్తలకు సూచించారు. శుక్రవారం వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా, సంఘటన్ సృజన్ అభియాన్ తెలంగాణ కార్యక్రమంతో టీపీసీసీ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా డీసీసీ భవన్‌లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. టీపీసీసీ అబ్జర్వర్లు సునీత, వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ ఉపాధ్యక్షులు నమిండ్ల శ్రీనివాస్, మాజీ ఎంపీ పసునూరి దయాకర్‌తో కలిసి నవజ్యోతి పట్నాయక్ హాజరై మాట్లాడారు. అధ్యక్షులను ఎంపిక చేసే క్రమంలో పార్టీ కార్యకర్తలు, మాజీ పదవీదారులు, ప్రస్తుత ప్రజా ప్రతినిధులు, సివిల్ సొసైటీ సభ్యులు, సీనియర్ నాయకుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ఈ అభియాన్ ద్వారా అధికారం కేవలం కొంతమందికి మాత్రమే పరిమితం కాకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలు, యువత వంటి అన్ని వర్గాలకు నాయకత్వావకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో స్థానిక నాయకులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నామని అన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఆసక్తి గల ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం దరఖాస్తు ఫారమ్‌ను విడుదల చేసి, ఏఐసీసీ, టీపీసీసీ అబ్జర్వర్లకు అందజేశారు. జిల్లాస్థాయి నాయకులతో వ్యక్తిగతంగా అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. సేకరించిన అభిప్రాయాలను టీపీసీసీకి సమర్పించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పింగిలి వెంకట్రాం నర్సింహారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీసం సురేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు కనపర్తి కిరణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పల్లె దయాకర్, కనపర్తి రాజు తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుల ఎంపిక విధానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES