- Advertisement -
నవతెలంగాణ-రాయికల్: మండలంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు రాజనగర్ నుండి ఎస్సీ కాలనీ, ఆలూరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా తెగిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రవాణా సౌకర్యం నిలిచిపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు,రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు.తక్షణమే రహదారి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
- Advertisement -