Thursday, July 3, 2025
E-PAPER
Homeజాతీయంహిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ర‌వాణ వ్య‌వ‌స్థ కుదేలు..!

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ర‌వాణ వ్య‌వ‌స్థ కుదేలు..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఉత్త‌ర‌భార‌త్‌లో కురిసిన కుండ‌పోత వ‌ర్షాలు హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్‌కు పెను న‌ష్టాన్ని మిగిలించాయి. ప‌లు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వానాలకు ఆ రాష్ట్రంలోని ర‌వాణా వ్య‌వ‌స్థ‌ తీవ్రంగా దెబ్బ‌తింది. ఈ మేర‌కు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం గురువారం ప్రెస్ నోట్ విడుద‌ల చేసింది. కొండ ప్రాంతాల్లోని వ‌ర‌ద ప్ర‌వాహానికి రోడ్లు, వంతెన‌లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో జ‌ల ఉధృతికి న‌దులు పొంగి పొర్లాయి. దీంతో నివాస ప్రాంతాలు జ‌ల‌దిగ్భందం కావ‌డంతో పాటు ప‌లు చోట్ల రోడ్లల‌న్ని జ‌ల‌మైయ్యాయి. వ‌ర‌ద ధాటికి రోడ్లు తెగిపోవ‌డంతో ఆయా ప్రాంతాల‌కు రాక‌పోక‌లు పూర్తిగా నిలిచిపోయాని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం గురువారం ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

భారీ వ‌ర్షాల‌కు గ‌డిచిన 24 గంట‌ల‌లో 261 రోడ్ల మార్గాలు పూర్తిగా మూసివేబ‌డ్డాయి. 599 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు (DTRలు) అంతరాయం కలిగింది. 797 నీటి సరఫరా పథకాలు ప్రభావితమయ్యాయ‌ని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (SEOC) రిపోర్టులో పేర్కొన్నారు. మండి జిల్లా అధిక న‌ష్టాన్ని చ‌విచూసింది. ధరంపూర్, సెరాజ్, థాలౌట్, కర్సోగ్ తోపాటు ఉపవిభాగాలలో 186 రోడ్లు దిగ్బంధించబడ్డాయి.

కుల్లు జిల్లాలో భారీ వర్షాల కారణంగా 37 రోడ్లు మూసుకుపోయాయని, వాటిలో నిర్మండ్‌లో 21, బంజార్‌లో 11 రోడ్లు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. మ‌రోవైపు స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం కొన‌సాగిస్తుంది. బాధితుల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లిస్తున్నారు. నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను వ‌ద‌ర బాధితుల‌కు పంపిణీ చేస్తున్నారు. స‌హాయ‌క కార్య‌క్ర‌మాల్లో ప్ర‌భుత్వ యంత్రాంగంత‌తో పాలు ప‌లు స్వ‌చ్చంద సంస్థ‌లు పాలుపంచుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -