Saturday, June 7, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయం12 దేశాలపై ట్రావెల్‌ బ్యాన్‌

12 దేశాలపై ట్రావెల్‌ బ్యాన్‌

- Advertisement -

– మరో ఏడు దేశాల నుంచి వచ్చే వ్యక్తులపై కఠిన ఆంక్షలు : ట్రంప్‌ కీలక నిర్ణయం
వాషింగ్టన్‌:
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. 12 దేశాలపై ట్రావెల్‌ బ్యాన్‌ విధించారు. ఆ దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించడాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. దీనితో పాటు, మరో ఏడు దేశాల నుంచి వచ్చే వ్యక్తులపై కఠినమైన ఆంక్షలు విధించారు. అమెరికా జాతీయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ట్రంప్‌ ఈ చర్య తీసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌, మయన్మార్‌, చాడ్‌, కాంగో, ఈక్వటోరియల్‌ గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్‌, లిబియా, సోమాలియా, సూడాన్‌, యెమెన్‌ వంటి 12 దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించకుండా పూర్తిగా నిషేధం విధించారు. ఇకపై ఈ దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించలేరు. బురుండి, క్యూబా, లావోస్‌, సియర్రా లియోన్‌, టోగో, తుర్కెమినిస్థాన్‌, వెనిజులా దేశాల నుంచి వచ్చే వారిపై కఠినమైన ఆంక్షలు విధించారు. ఈ నిషేధపు ఉత్తర్వుల నుంచి చట్టబద్ధమైన శాశ్వత నివాసితులు (గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్లు), ఇప్పటికే వీసాలు కలిగి ఉన్నవారు, కొన్ని ప్రత్యేక వీసా కేటగిరీలకు చెందినవారు, అమెరికా జాతీయ ప్రయోజనాలకు అవసరమైన వ్యక్తులు వీరందరికీ మినహాయింపులను ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -