- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రావెల్ బస్సు బోల్తాపడి నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ఇందల్వాయి మండలం గన్నారం వద్ద గల 44 జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి 22 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ప్రమాదవాశాత్తు బోల్తాపడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



