గతంలో కట్టపై పోసిన సింగిల్ బీడీ రోడ్డు పాక్షికంగా ధ్వంసం
కట్టపై రోజు వందల వాహనాల రాకపోకలు..
నవతెలంగాణ – రాయపర్తి: మహబూబ్ నగర్ బోజ్జన్న కుంట చెరువు కట్టపై వాహన ప్రయాణం ప్రమాదక ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రాయపర్తి మండల కేంద్రానికి అతి సమీపంలో ఉండే మహబూబ్ నగర్ గ్రామానికి వెళ్లాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బొజ్జన్న కుంట చెరువు కట్ట సుమారు ఆఫ్ కిలోమీటర్ పైనే ఉంటుంది. కట్టపై గతంలో సింగిల్ బీడీ రోడ్డు నిర్మించారు. కాలక్రమేన బిటి రోడ్డు గుంతల మాయమైపోయింది. ఇరుకైన కట్టపై రోడ్డు గుంతలుగా ఏర్పడడంతో వాహనదారులు ప్రమాదపుటంచున ప్రయాణిస్తున్నారు. ఒక వాహనం వెళ్తుంటే మరో వాహనం పక్కనుండి వచ్చే అవకాశం లేకుండా పోయింది. స్కూల్ బస్సులు, డీసీఎంలు, లారీలు వచ్చినప్పుడు పక్కనుండి ద్విచక్ర వాహనం వెళ్లే పరిస్థితి కూడా ఉండడం లేదని గ్రామస్తులు బాధపడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రమాదాలు జరగ ముందే స్పందించి బొజ్జన్న కుంట చెరువు కట్టపై డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.
మహబూబ్ నగర్ చెరువు కట్టపై ప్రయాణం.. ప్రమాదమే..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES