– పంచాయతీ ‘నేమ్‌బోర్డుకు’ కొత్త ఐడియా
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని ఊట్లపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద కనిపిస్తున్న ఏర్పాటు చూసినవారికి కాసేపు నవ్వు, కాసేపు ఆశ్చర్యం కలిగిస్తోంది. సాధారణంగా కార్యాలయ నేమ్‌బోర్డు ఏర్పాటు చేయాలంటే రెండు వైపులా ఇనుప గొట్టాలు లేదా సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం చెట్లు నే స్తంభాలుగా ఉపయోగించారు.కార్యాలయం ప్రధాన ద్వారం కు ఇరువైపులా ఉన్న రెండు అలంకార చెట్ల మధ్యనే పంచాయతీ కార్యాలయ నేమ్‌బోర్డును బిగించారు.
దీంతో కొత్తగా స్తంభాలు వేయాల్సిన పని లేకుండా ఖర్చు కూడా మిగిలింది. “ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది” అనే వ్యాపార ప్రకటనలా, ఇక్కడ మాత్రం “ఒక ఐడియా ఖర్చును తగ్గిస్తుంది” అని చెప్పుకోవచ్చు. చూసినవారు సరదాగా “స్తంభాల పని చెట్లు చేసేశాయి. పంచాయతీకి ఖర్చు కూడా తప్పింది” అంటూ చమత్కరిస్తున్నారు.చిన్న ఆలోచన అయినప్పటికీ ఈ వినూత్న ఏర్పాటు గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.



