- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : జార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. 17 ఏళ్ల గిరిజన మైనర్ బాలికపై 10 మంది లైంగికదాడి చేశారు. గొడ్డా జిల్లా సుందర్ పహారి పోలీస్ స్టేషన్ పరిధిలో 17 ఏళ్ల గిరిజన మైనర్ బాలికపై 10 మంది లైంగికదాడి చేశారు. ఓ పెండ్లికి బంధువుల ఇంటికి బాలిక వెళ్ళింది. శుక్రవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటికెళ్ళినప్పుడు బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేయారు.
ఇక బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ సంఘటన లో 8 మందిని అరెస్ట్ చేసారు పోలీసులు. అటు పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
- Advertisement -