నవతెలంగాణ-భువనగిరి
కలెక్టరేట్ఇటీవలి విడుదల చేసిన గ్రూపు-2 ఫలితాలలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పెంచికల్ పహాడ్ గ్రామనికి చెందిన కీ.శ్రే బాల్ద (రాజయ్య) లక్ష్మి ల కూతురు రాష్ట్ర సెక్రటేరియట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా ఎంపిక కావడంతో గ్రామస్తులు కుటుంబ సభ్యులను ఘనంగా బుధవారం సత్కరించారు. ఈ సందర్భంగా గోపె నరసింహ మాట్లాడుతూ ఈ విజయం ద్వారా గ్రామానికీ మంచి పేరు తెచ్చి ఉన్నత స్థాయిలో నిలిపినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి, భవిష్యత్ లో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకొని గ్రామంలో నిరుద్యోగులకు దిశ నిర్దేశం చేస్తూ మార్గదర్శకులు గా ఉండాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బాల్ద మహేష్, గ్రామ పెద్దలు సిలువేరు ఏసు, గోపె మహంకాళి, మహేష్, కుమారస్వామి, కరుణాకర్, సురేష్, రాజు లు పాల్గొన్నారు.
పెంచికలపాడు వాసి అనుష కు సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES