Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeహైదరాబాద్జానపద కళాకారిణి మారపాక స్వప్నకి స‌న్మానం

జానపద కళాకారిణి మారపాక స్వప్నకి స‌న్మానం

- Advertisement -

నవతెలంగాణ –  హైదరాబాద్‌: కళాబంధు డాక్టర్‌ పి.అనూహ్యారెడ్డి కోలాటం, జానపద కళాకారిణి మారపాక స్వప్నను శాలువాతో స‌న్మానించి మెమోంటంను ఇవ్వ‌డం జ‌రిగింది. అంతర్జాతీయ జానపద దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కొవిద సహృదయ ఫౌండేషన్‌ సహకారంతో కొవిద ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ అకాడమీ, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో జానపద జనజాతర ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్‌ పి.అనూహ్యారెడ్డి మాట్లా డుతూ జానపద కళాకారిణి మారపాక స్వప్నచేసిన సేవ‌ల‌ను కొనియాడారు. ఒక ప్రాంత చరిత్ర, కష్టాలు, ఆనందాలు, అక్కడి మనుషుల మనస్తత్వం అన్నీ కళారూపాల్లో ప్రతిబింబి స్తాయని తెలిపారు. జానపద కళలను ముందు తరాలకు పరిచయం చేసి ప్రోత్సాహం ఇవ్వడం మనందరి సామాజిక బాధ్యత అన్నారు.
 ఈ కార్యక్రమంలో జానపద గాయకుడు, దర్శకులు కె.నరసింహ, మాజీ ఎంపీటీసీ అట్ల రవీందర్‌ రెడ్డి-మంజుల దంపతులు, చినుకు మూర్తి, భూపతి వెంకటేశ్వర్లు, హిమబిందు, రాములు, విజ్ఞానదర్శిని టి. రమేష్‌, నృత్య గురువులు లావణ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad