Monday, May 19, 2025
Homeట్రెండింగ్ న్యూస్సుందరయ్యకు నివాళి

సుందరయ్యకు నివాళి

- Advertisement -

గత 42 సంవత్సరాలు నాకు జతగా వుండి, ఈ రోజు (19-05-1985) నన్ను వదిలి పెట్టి వెళ్లిపోయావు. ఒంటరిగా అని అనను. మన పార్టీ, మన ప్రజలు నాతో వున్నారు. ఆ ఆత్మవిశ్వాసంతో నేను నా జీవితాంతం నీవు త్రోక్కిన బాటనే నడుస్తానని వాగ్దానం చేస్తున్నాను. నీ చితి దగ్గర చెప్పాల్సిన మాటలు చెప్పలేక , ఈ రోజు చేప్పుచున్నాను. క్షమించు.

ఆయన ఒక్క కమ్యూనిస్టులకు మాత్రమే ప్రియతమమైన నాయకుడు కాదు .దేశభక్తులైన, స్వాతంత్ర్య పిపాస కలిగిన భారత ప్రజలందరి ప్రేమాభిమానాలను ఆయన చేరగొన్నారు. ఆయన అచంచలమైన మార్క్సిస్టు -లెనినిస్టు .ఆయన ఆదర్శప్రాయమైన త్యాగనిరితి, నిరాడంబరత ఆయనకు గౌరవమన్ననలను సంపాదించిపెట్టాయి. భారత కమ్యూనిస్టు ఉద్యమ ప్రముఖ నాయకునిగానే కాకుండా, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో అత్యున్నత స్థాయి నాయకులలో ఒకరిగా చరిత్రలో సుందరయ్య నిలిచిపోతారు. వర్గబానిసత్వం నుండి ప్రజలను విముక్తి చేసే ఆశయానికి కట్టుబడి ఉన్నవారు కనుక కమ్యూనిస్టులు స్వభావరీత్యానే మానవతావాదులు . ఐతే మాలో చాలామంది కమ్యూనిస్టుల కంటే ఎక్కువ మానవతావాదిగా చాలా సందర్భాలలో నా మనస్సును చేరగొన్నారు సుందరయ్య. ఆదర్శప్రాయమేన రీతిలో స్వీయావసరాలను త్యాగం చేయగలిగేవారు ఆయన. కాని ఇతర కామ్రేడ్స్ విషయం వచ్చినప్పుడు సుందరయ్య అత్యంత కరుణా హృదయంతో ఉన్న పరిస్థితులలో చేయగలిగినదంతా చేసేవారు. పార్టీ కేడర్ పట్ల ఆయన ప్రేమ సాటి లేనిది. ఈ విశిష్ట లక్షణాన్ని చాలామంది మార్క్సిస్టు
-లెనినిస్టు నాయకులు కామ్రేడ్ సుందరయ్య నుండి నేర్చుకోవలసి ఉంది.

కామ్రేడ్ సుందరయ్య ఇన్ని విజయాలు సాధించగలిగారంటే ఆయనలో కొన్ని ప్రత్యేక సుగుణాలుండటమే దానికి కారణం . ఆయన అంకిత భావం, ప్రజలలో ఒకరుగా కలిసిపోగల ఆయన స్వభావం. బహుశా జనబాహుళ్యంలో అంతగా కలిసిపోయినవారు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)లో ఒక్క ఎ.కె.గోపాలన్ తప్ప మరెవ్వరూ లేరు. వీరిద్దరూ ప్రజల తరుపు మనుషులుగా, ప్రజల యొక్క మనుషులుగా, ప్రజల కోసం నిలిచే మనుషులుగా ఎప్పుడూ జనబాహుళ్యంలోనే ఉండేవారు. ప్రజలతో అందులోనూ అట్టడుగు వర్గాలలో సజీవ సంబంధాలు కలిగివుండటం, ఎప్పుడూ పార్టీ సభ్యులకు , కార్యకర్తలందరికి అందుబాటులో ఉండటం, నిరాడంబర జీవితం వీటన్నిటి కారణంగానే సుందరయ్య పార్టీకి నూతన విజయాలు చేకూర్చగలిగాడు. కామ్రేడ్ పిఎస్ ఒక సంపన్నమైన జీవితంగడిపాడు.ధనసంపదలు సుఖ బోగాలలో గాక సిద్ధాంత బలం, ప్రజల ప్రేమాభిమానాలు పొందడంలో, పార్టీ కోసం చేయవలసిందంతా చేశామనే సంతృప్తి పొందడంలో ఆయన సంపన్నుడు . ఈ విధమైన సంపన్నత చాలా కొద్ది మందికే వుంటుంది. ఆయన స్మృతి మనలో చిరకాలం నిలిచివుండి మనందరం పార్టీ కోసం పనిచేసే విధంగా ప్రేరణనిచ్చును . కామ్రేడ్ పిఎస్ 55 ఏళ్లపాటు కమ్యూనిస్టుగా జీవించారు. కృషి చేశారు. కమ్యూనిస్టు పార్టీ నిర్మాతగా ఆయన ఎప్పటికి గుర్తుండిపోతారు . అందించిన నాయకత్వంలో సాగిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం భారత దేశ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో మహాత్తర అధ్యయనంగా నిలిచిపోతుంది .కామ్రేడ్ సుందరయ్య కమ్యూనిస్టులందరికి ఆదర్శంగా ఉంటారు.

కృష్ణ పిళ్లేను, నన్నూ ఎంతో ప్రభావితం చేసిన ఆ మొదటి సమావేశాన్ని మరువలేను. ముమ్మూర్తులా నిజమైన విప్లవకారుని మేము సుందరయ్యగారిలో చూడగలిగాము. నిరాడంబరత, రాజకీయ అభిప్రాయాల పట్ల దృఢవైఖరి, పదుటివారు చెప్పేదానిని శ్రద్ధగా ఆలకించడం, వారి సమస్యను అర్థం చేసుకోవడం, వాటిని అధిగమించడానికి, సాయపడాటానికి ఆతృత చేసడం మా హృదయాలలో శాశ్వతముద్రను వేశాయి. సుందరయ్యగారి జీవితాంతం ఆయనను కలుసుకున్న ప్రతిసారి అదే అనుభూతిని పొందాం.

పార్టీ కేంద్ర కమిటీలో ఏదైనా కీలకాంశంపై అభిప్రాయభేదాలొచ్చినప్పుడు కామ్రేడ్ సుందరయ్యగారు అంకితభావం గల కమ్యూనిస్టుగా మెజరిటీ నిర్ణయాన్ని అంగీకరించి దాని ప్రకారం పని చేసేవారు. ఒక కమ్యూనిస్టుకు ఎలాంటి లక్షణాలుండాలో ఆ లక్షణాలన్నింటీనీ కామ్రేడ్ సుందరయ్యగారు ఆదర్శవంతంగా చూపించారు. ఆయన్ని మనం అనుసరించాలి, ఆ లక్షణాలను మనం సంతరింప చేసుకొవాలి.

‘సుందరయ్య ప్రజలను ప్రేమిస్తాడు. ప్రజల మధ్య ఉండటమే ఆయనకు ఆనందం. ప్రజల నుండి నేర్చుకోవడం ఆయన సిద్ధాంతం. ఆ రకంగానే ఆయన మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఆచరణలో అన్వయించడానికి ప్రయత్నించారు. తన 55 ఏళ్ళ రాజకీయ జీవితంలోను ఆయనను కలుసుకున్న ప్రతి ఒక్కరి హృదయాలను జయించగలిగారు. వారు కమ్యూనిస్టులు కానివ్వండి, కమ్యూనిస్టులు కానివారు కానివ్వండి గట్టి మార్క్సిస్టుగా, స్వాతంత్ర్యయోధుడిగా, పీడిత ప్రజల కోసం పాటుబడిన నిస్వార్థ కార్యకర్తగా ఆయనను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -