నవతెలంగాణ – కంఠేశ్వర్ : భద్రాద్రికొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి మండలానికి సంబంధించిన ఎంఐఎస్ కోఆర్డినేటర్ బత్తుల రాజేష్ సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ నేపథ్యంలో వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతూ ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వం బత్తుల రాజేష్ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కే రాజు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సమగ్ర శిక్ష ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని, బత్తుల రాజేష్ కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మరియు సమగ్ర శిక్ష ఉద్యోగులకు ప్రభుత్వం సమ్మె విరమింప చేసిన సందర్భంలో ఇచ్చిన హామీ ప్రకారం సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలని సమ్మె విరమణ ఒప్పందాలను తూచా తప్పకుండా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నాయకులు నాగేష్ గౌడ్, విద్యాసాగర్,శ్రీనివాస్ పవిత్రన్ ,సురేష్,హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
సమగ్ర శిక్ష ఉద్యోగికి నివాళులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES