- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఆలూర్ మండల కేంద్రంలో బుధవారం కానిస్టేబుల్ గణేష్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. జక్రాన్‌పల్లికి చెందిన కానిస్టేబుల్ గణేష్ గతంలో మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ గౌడ్ గణేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి, అక్కడ ఒక నిమిషం మౌనం పాటించారు.ఈ కార్యక్రమంలో పోలీసులు, గణేష్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -