హాలీవుడ్ మూవీ ‘ట్రిగ్గర్ వార్నింగ్’ ఒక రివెంజ్ యాక్షన్ మూవీ అయినా బలహీన కథనం వలన, ట్విస్ట్ లు ముందే తెలిసి పోవటం వలన అంతగా ఆకట్టుకోలేక పోయింది. ట్రిగ్గర్ అంటే హెచ్చరిక.
జరగపోయే సంఘటనలు ముందుగా చిన్నపాటి క్లూ ద్వారా తెలిసిపోతాయి.. ఇందుకు కారణం పటుత్వం లేని స్క్రీన్ప్లే. అలాగని దర్శకురాలు ఇప్పుడే కథను డీల్ చేసిన వ్యక్తి కాదు. ఈ సినిమాకు దర్శకురాలు ‘మౌళి సూర్య’. పురుష పేరు ధ్వనించినా ఈమె మహిళనే! ఈమె ఇండోనేషియాకు చెందిన మహిళ. ఈమె తొలిచిత్రం ‘ఫిక్కీ’. 2008 లో విడుదలైన ఈ చిత్రం చాలా మంచి పేరు తెచ్చుకుని, ఆమెకు ఉత్తమ దర్శకురాలుగా అవార్డ్ సాధించి పెట్టింది.
ఇక, ఈ చిత్రంలో నాయిక పాత్రలో హాలీవుడ్ పాపులర్ హీరోయిన్ జెస్సికా ఆల్బా డామినేటింగ్ పాత్రలో రాణించింది. ఒక విధంగా ఈ చిత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ.
ఇక క్లుప్తంగా కథ విషయానికి వస్తే పార్కర్ (జెస్సికా ఆల్బా), స్పైడర్ (టోన్ బెల్) అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీలో స్పైగా పని చేస్తారు. ఆపరేషన్ అలైస్ 116 మిషన్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని వస్తారు. రాగానే పార్కర్ కు తండ్రి మరణ వార్త తెలుస్తుంది. అయితే, మైన్స్ లో పనిచేస్తున్న అతను యాక్సిడెంటల్ గా చనిపోవడంతో పార్కర్ కు అనుమానం వస్తుంది.
అయితే, పార్కర్ తండ్రిది సూసైడ్ కావొచ్చు అని ఆమె మాజీ బోరు ఫ్రెండ్ జెస్సీ (మార్క్ వెబ్బర్) చెపుతాడు. ఇతను టౌన్ షరీఫ్ (పోలీస్) గా పనిచేస్తుంటాడు. అయితే ఆమె నమ్మదు. అయితే, కాకతాళీయమో, ఏమో కానీ ఇక్కడ పార్కర్ అనేది పురుషుడికి సంబంధిన నామధేయం కాగా జెస్సీ అనేది స్త్రీకి సంబంధించిన పేరు.
తన తండ్రిది హత్యగా భావించిన పార్కర్ అతడి మరణానికి ఎలా పగ తీర్చుకుంది? అనేది కాన్సెప్ట్. రొటీన్ సినిమానే. అయితే ఫోటోగ్రఫీ సినిమాను కొద్దిగా నిలబెట్టింది. అయితే సినిమా చాలా స్లోగా నడుస్తుంది. అందుకే ప్రేక్షకుడికి కొద్దిగా విసుగు జనిస్తుంది.
తండ్రితో పార్కర్ అనుబంధం, కొద్దిగా లవ్ ట్రాక్, సిటీలో జరుగుతున్న సంఘటనలతో సినిమా గంట సేపు సాగుతుంది. ఆరంభంలో సన్నివేశాలు, ఫైట్స్ బాగున్నాయి. సినిమా ఇదే టెంపోతో నడుస్తుంది అని ప్రేక్షకుడు భావిస్తాడు. అయితే అతని అంచనాలకు విరుద్ధంగా సినిమా నడుస్తుంది.
ఒక హత్య మీద ఇన్వెస్టిగేషన్ అంటే ఎంతో సస్పెన్స్ ఉండాలి. అయితే, ట్విస్ట్ ఎప్పటికప్పుడు విడిపోతుంది. జరగబోయేది ప్రేక్షకుడి ఊహకు అనుగుణంగానే ఉంటుంది.
అయినా మొన్నటి వరకు ఈ ‘ ట్రిగ్గర్ వార్నింగ్ ‘ టాప్ 5 లో ఉంది. ప్రస్తుతం టాప్ 8 లో ఉంది.
ఈ సినిమాలో అసభ్య, అశ్లీల సన్నివేశాలు లేవు కనుక అందరూ నిరభ్యంతరంగా వీక్షించ వచ్చు. ఈ సినిమా విడుదల తేదీ 21 జూన్ 2024. నెట్ ఫ్లిక్స్ లో తెలుగు భాషలో సైతం అందుబాటులో ఉంది. నిడివి 1.45 నిముషాలు.
సహజంగా ఇటువంటి చిత్రాల మీద ఎన్నో అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను చేరుకోనందున తెలుగు లో రేటింగ్ చాలా స్వల్పంగానే ఉంది.
- పంతంగి శ్రీనివాస రావు,
9182203351