Monday, April 6, 2026
E-PAPER
Homeఆదిలాబాద్సిఎం పర్యటనకు మూడంచెల భద్రత

సిఎం పర్యటనకు మూడంచెల భద్రత

- Advertisement -

– ఇబ్బందులు పడ్డ భక్తులు, నాయకులు, మీడియా ప్రతినిధులు
నవతెలంగాణ -ముధోల్ ‌: బాసర పర్యటన కు సోమవారం వచ్చిన సిఎం రెవంత్ రెడ్డి పర్యటనకు పోలిసులు ఏర్పాటు చేసిన మూడంచెల భద్రత తో భక్తులు, నాయకులు, మీడియా కు ఇబ్బందులు తప్పలేదు. బాసర ఆలయ పునర్నిర్మాణం భూమి పూజ,మనమడి అక్షరాభ్యాసం కార్యక్రమం లో సిఎం పాల్గొనడంతో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో పోలీసులు ఆలయం పరిసరాలతో పాటు, గోదావరి నది, రైల్వే స్టేషన్,బాసర గ్రామంలో ఎక్కడికక్కడ పోలీసుల బందోబస్తు చెప్పట్టారు. అక్కడక్కడ భారీ గేట్లను ఏర్పాటు చేశారు. ఆలయం కు సీఎం రాకన్నా ముందు నుంచి భక్తులను ఆలయంలోకి పోలిసులు అనుమతించలేదు. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. తమ సమస్యలపై వినతిపత్రానికి ఇవ్వడానికి వచ్చిన ఆశా కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేసి ముధోల్ పోలిస్ స్టేషన్ కు తరలించారు . అయితే సీఎంను చూడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్మల్ జిల్లా నుండి అధిక సంఖ్యలో బాసరకు చేరుకున్నారు. అయితే చాలామంది ముఖ్య నాయకుల కు సైతం ఆలయం బయట,లోపల గాని అనుమతించలేదు. దీంతో తమ పార్టీ నాయకుడు వచ్చిన తాము దగ్గరగా చూసే అవకాశం లేకపోవడంపై నాయకులు పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది ముఖ్య నాయకులు ఎమ్మెల్యే ల చొరవతో ఆలయ పునర్నిర్మాణం భూమి పూజ వరకు వెళ్లగలిగారు. సీఎం మనమడి అక్షరాభ్యాసం కార్యక్రమం వ్యక్తిగత కావటంతో పోలీసుల ఆంక్షలు విధించారని పలువురు పేర్కొంన్నారు. అయితే ఆలయ పునర్నిర్మాణం కార్యక్రమం అధికారికంగా అయినప్పటికీ మీడియాను అనుమతించకపోవడంపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అయ్యాయి. కనీసం మీడియా ప్రతినిధులు ఆలయ పరిసరాల్లో కూడా వెళ్లకుండా పోలీసులు నిరోధించడంపై పలువురు జర్నలిస్టుల అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల ఆంక్షల తో జర్నలిస్టులు టీవీలు, ప్రత్యేక ప్రసారాల పై ఆధారపడి సీఎం బాసర పర్యటన వార్తలు కవర్ చేయాల్సిన పరిస్థితి నీ ఎదుర్కొన్నారు. ఏది ఏమైనా భద్రత పేరిట పోలిసులు కఠినంగా ఆంక్షలు విధించటంపై త్రీవ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -