Sunday, October 5, 2025
E-PAPER
Homeజాతీయంఅతలాకుతలమైన హిమాచల్‌ప్రదేశ్‌

అతలాకుతలమైన హిమాచల్‌ప్రదేశ్‌

- Advertisement -


ఆకస్మిక వరదలు..
సిమ్లా: ఆకస్మిక వరదలు హిమాచల్‌ప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. కుల్లూలో బియాస్‌ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికి ఇద్దరు మతిచెందారు. ఇందిరా ప్రియదర్శిని జలవిద్యుత్తు ప్రాజెక్టు సమీపంలోని లేబర్‌ కాలనీకి చెందిన కార్మికులు దాదాపు 20 మంది కొట్టుకుపోయినట్లు సమాచారం. భారీవర్షాల కారణంగా ప్రాజెక్టు పనిని నిలిపివేశారు. వరద ప్రవాహ వేగంతోపాటు బియాస్‌, సట్లెజ్‌ నదుల్లో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతున్న అధికారులు తెలిపారు. దీంతో ఎస్డీఆర్‌ఎఫ్‌ దళాలు, స్థానిక అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగమై ఉన్నాయి. బంజర్‌ సబ్‌డివిజనులో ఓ వంతెన కొట్టుకుపోయింది. కాంగ్డా జిల్లాలోని పాలంపుర్‌లో మంగళవారం సాయంత్రం నుంచి 145.5 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. దాదాపు ఏడు జిల్లాల్లో జూన్‌ 29 దాకా భారీవర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ కార్యాలయం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -