Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుట్రబుల్‌ షూటర్‌ ఐజీ సత్యనారాయణ

ట్రబుల్‌ షూటర్‌ ఐజీ సత్యనారాయణ

- Advertisement -

– ఆయన పదవీ విరమణ కార్యక్రమంలో డీజీపీ జితేందర్‌ కితాబు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి:
శాంతిభద్రతల నిర్వహణలో పోలీసు శాఖలో ట్రబుల్‌ షూటర్‌గా ఐజీ సత్యనారాయణ నిలిచారని రాష్ట్ర డీజీపీ జితేందర్‌ ప్రశంసించారు. రాష్ట్ర మల్టీజోన్‌-2 ఐజీపీ సత్యనారాయణ సోమవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా డీజీపీ కార్యాలయంలో జరిగిన ఆయన వీడ్కోలు సభలో డీజీపీ మాట్లాడుతూ ఎస్‌ఐ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఐజీ స్థాయికి ఎదిగిన సత్యనారాయణ తన ప్రతీహౌదాలో విధి నిర్వహణకు సంబంధించి ప్రత్యేకతను చాటుకున్నారని ప్రశంసించారు. ముఖ్యంగా, శాంతిభద్రతల పరిరక్షణ, మతకలహాలను నిరోధించటంలో ఆయన చూపించిన సమర్ధత వలన అనేక సందర్భాలలో పరిస్థితులు విషమరూపం దాల్చకుండా నివారించబడ్డాయని అన్నారు. చిత్తశుద్ధి, పట్టుదల, క్రమశిక్షణతో వ్యవహరిస్తే కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు ఏ విధంగా ఎదగవచ్చో పోలీసు శాఖలో సత్యనారాయణ నిరూపించారని డీజీపీ తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తన విధుల సామర్థ్యాన్ని పెంచుకొని ఇటు తనకు, అటు పోలీసు శాఖకు ఐజీ మంచి పేరు తెచ్చారని డీజీపీ మెచ్చుకున్నారు. రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌ మాట్లాడుతూ.. నగర సౌత్‌జోన్‌ డీసీపీగా, కరీంనగర్‌, రామగుండం కమిషనర్‌గా వివిధ హౌదాల్లో ఆయన పని చేసి ఉన్నతాధికారి అంటే ఇలా ఉండాలని ఇటు ప్రజలు, అటు పోలీసు శాఖలో పేరు తెచ్చుకున్నారని చెప్పారు. రిటైర్మెంట్‌ అయ్యాక ఆయన సమాజ హితం కోసం మరిన్ని కార్యకలాపాలు చేపట్టాలని ఈ సందర్భంగా మాట్లాడిన ఇతర పోలీసు అధికారులు అభిలాషించారు. ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ… తన సర్వీసులో పలువురు ఉన్నతాధికారులు, కిందిస్థాయి సిబ్బంది తనకు అందించిన సహకారాన్ని తాను ఎన్నడూ మరవలేననీ, చిత్తశుద్ధితో విధి నిర్వహణ చేస్తే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చని తనకు అనుభవంలోకి వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా డీజీపీ.. ఐజీ సత్యనారాయణకు శాలువ కప్పి, పుష్పమాల వేసి సత్కరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad